తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సెట్స్​లోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది: భూమిక

శ్రీకాంత్-భూమిక నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్​లో తిరిగి ప్రారంభమైంది. చాలారోజుల తర్వాత సెట్స్​లో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని ఈమె చెప్పింది.

srikanth-bhoomika-cinema-shooting-resume-in-hyderbad
భూమిక

By

Published : Oct 31, 2020, 9:02 PM IST

Updated : Oct 31, 2020, 9:29 PM IST

సెట్స్​లో భూమిక-శ్రీకాంత్ తదితరులు

శ్రీకాంత్, భూమిక ప్రధాన పాత్రల్లో సుమంత్ అశ్విన్, తాన్యా జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. లాక్​డౌన్ కంటే ముందు లద్దాఖ్​లో 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు హైదరాబాద్​లో మళ్లీ మొదలుపెట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పనిచేస్తున్నారు.

నాలుగు పాత్రల చుట్టూ ఉండే రోడ్డు ప్రయాణం ఆధారంగా దర్శకుడు గురుపవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సెట్స్​లోకి రావడం ఆనందంగా ఉందని చెప్పిన భూమిక... త్వరలోనే తెరపై కనిపిస్తామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా థియేటర్లు తెరుచుకుని పరిస్థితి మెరుగుపడాలని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Oct 31, 2020, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details