నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె భర్త బోనీ కపూర్, పిల్లలు జాన్వీ, ఖుషీ కపూర్లు హాజరయ్యారు.
1987లో శ్రీదేవి నటించిన 'మిస్టర్ ఇండియా' సినిమాలోని 'హవా హవాయి' లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నిజంగా శ్రీదేవి మళ్లీ వచ్చిందా అనేట్టుగా ఉంటూ ఆశ్చర్యపరుస్తోందీ ప్రతిమ. తల్లి మైనపు బొమ్మను చూస్తూ అలాగే ఆనందంతో ఉప్పొంగిపోయారు జాన్వీ, ఖుషీ. ఈ వేడుకకు శ్రీదేవి సోదరి.. హీరోయిన్ మహేశ్వరి కూడా హాజరైంది.