అలనాటి అందాల తారలు శ్రీదేవి, రేఖ.. ప్రతిఏటా ఏ.ఎన్.ఆర్ ఫౌండేషన్ ఇచ్చే అక్కినేని జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారు. 2018కి గానూ శ్రీదేవి, 2019కి గానూ రేఖ ఈ అవార్డులు సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఈనెల 17న జరిగే ఈవెంట్లో ప్రముఖ నటుడు చిరంజీవి చేతుల మీదుగా ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. ఈ విషయాన్ని అక్కినేని జాతీయ అవార్డు ఛైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి చెప్పారు.
శ్రీదేవి, రేఖలకు ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాలు - ANR NATIONAL AWARDS 2019
ప్రతిఏటా ఇచ్చే అక్కినేని జాతీయ అవార్డులు.. అలనాటి తార శ్రీదేవి(2018), రేఖ(2019)లను వరించాయి. హైదరాబాద్‌లో ఈ నెల 17న ప్రదానోత్సవం జరగనుంది.
శ్రీదేవి, రేఖలకు ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాలు
నటి శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్.. అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. అవార్డు క్రింద 5 లక్షల నగదు బహుబతి అందివ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు. గతంలో అమితాబ్‌బచ్చన్, బాలచందర్, దేవానంద్, రాజమౌళి, లతా మంగేష్కర్ వంటి సినీ ప్రముఖులు ఏఎన్ఆర్ అవార్డులు అందుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావుతో శ్రీదేవి, రేఖలకు మంచి అనుబంధం ఉంది. ఏఎన్ఆర్ - శ్రీదేవి కాంబినేషన్‌లో 'ప్రేమాభిషేకం', 'శ్రీవారి ముచ్చట్లు' లాంటి సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి.