హిందీ చిత్రసీమలో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న హీరోయిన్ జాన్వీ కపూర్.. తన బెల్లీ డ్యాన్స్‌తో నెటిజన్లను కట్టిపడేసింది. శ్రీదేవి పెద్ద కూతురైన ఈ అమ్మడు.. ఇప్పటికే కథక్‌లో శిక్షణ తీసుకుంది. అయితే తనకు ఈ కళలో ఓనమాలు నేర్పింది మాత్రం తన తల్లి శ్రీదేవి అని వెల్లడించిందీ యువనటి.
అతిలోక సుందరి స్టెప్పులు...
పాఠశాలలోని ఓ సాంస్కృతిక కార్యక్రమంలో జాన్వీ నృత్యం చేయాల్సి వచ్చిందట. ఇందుకోసం 'హర్ దిల్ జో ప్యార్ కరేగా'లోని ఓ పియా పియా పాటకు డ్యాన్స్ నేర్పిందట శ్రీదేవి. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన అతిలోక సుందరి... స్వయంగా స్టెప్పులు రూపొందించి జాన్వీకి నేర్పించిందట. ఈ వేడుకలో జాన్వీ ప్రదర్శనకు విపరీతమైన ప్రశంసలు దక్కాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిందీ నటి.
జాన్వీ ప్రస్తుతం 'తఖ్త్' సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారత వాయుసేన మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లోనూ, 'రూహ్ అఫ్జా' అనే సినిమాలోనూ నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ సిరీస్ 'ఘోస్ట్ స్టోరీస్'లోనూ సందడి చేయనుంది.