Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ప్రోమో వచ్చేసింది. ఓవైపు నవ్విస్తూనే, మరోవైపు పూర్తిగా కంటతడి పెట్టించింది. 'ఉమెన్స్ డే' సందర్భంగా మార్చి 6న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఈ ఎపిసోడ్లో భాగంగా ఇమ్మాన్యుయేల్, నరేశ్, రాకేశ్, సుజాత.. వారి వారి అమ్మలతో సహా ఈవెంట్‌కు వచ్చారు. అమ్మతో తమకున్న అనుబంధాన్ని చెప్పారు. నటి శ్రీవాణి.. తన కుమార్తెతో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. కమెడియన్ బాబు, తన అక్కతో కలిసి నవ్వించగా.. ఇమ్మాన్యుయేల్, అతడి తల్లితో కలిసి నాన్‌స్టాప్ పంచులు వేశాడు.