ట్రైలర్‌తోనే సంచలనం సృష్టించిన బాలీవుడ్ సినిమా 'శ్రీదేవి బంగ్లా'. ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో అతిలోకసుందరి శ్రీదేవి మరణం గురించి చూపించనున్నారని చాలా చర్చే జరిగింది. కానీ ఆమెకు.. ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు నటుడు అర్భాజ్ ఖాన్. ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
చర్చకు కారణమిదేనా..!
ఈ సినిమా ట్రైలర్ చివర్లో హీరోయిన్ పాత్రధారి ప్రియాప్రకాశ్ వారియర్.. బాత్‌టబ్‌లో పడి చనిపోయినట్లు ఉంటుంది. సరిగ్గా ఇలాగే 2018,ఫిబ్రవరిలో దుబాయిలో నటి శ్రీదేవి మృతి చెందింది. ఈ రెండూ ఒకేలా ఉండటం వల్ల ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.. 'శ్రీదేవి బంగ్లా' చిత్ర బృందానికి లీగల్ నోటీసు పంపారు.