విభిన్న కథలు ఎంచుకుంటూ సాగుతున్నాడు హీరో శ్రీవిష్ణు. 'బ్రోచేవారెవరురా'తో ఇటీవలే హిట్ కొట్టాడు. తన సినిమాలన్నీ ఎందుకు డిఫరెంట్గా ఉంటాయో చెపుతూ మరెన్నో ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
"సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అందరూ నన్ను చూసి ఇలా ఉంటే కష్టం, దూసుకుపోవాలని చెప్పారు. అయితే అవేవీ నిజం కావని తర్వాత అర్థమైంది. మనం కలిసే వ్యక్తుల బట్టి మనకు దారి దొరుకుతుంది. ప్రతిభ ఆధారమవుతుంది. కొన్నిసార్లు అదృష్టం తోడవ్వాలి. ఏ అవకాశం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. అయినా మన కంటే మన పని మాట్లాడితే బాగుంటుందనేది నా ఉద్దేశం. నేను విఫలగాథల్లోనే ఎక్కువ కనిపించడానికి కారణం.. వాటిని చెప్పడం నాకు చాలా ఇష్టం. అందులో నుంచే కొన్నింటికి పరిష్కారాలు లభిస్తాయి." -శ్రీవిష్ణు, హీరో