తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇండస్ట్రీకి వచ్చాక ఆ విషయం అర్థమైంది' - ఆలీతో సరదాగా అనిల్ రావిపూడి

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' సెలిబ్రిటీ టాక్ షోకు అతిథులుగా విచ్చేశారు నటుడు శ్రీ విష్ణు, దర్శకుడు అనిల్ రావిపూడి. వీరి జీవితం, సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Sri Vishnu
శ్రీ విష్ణు

By

Published : Mar 10, 2021, 8:23 AM IST

"కెరీర్‌ ప్రారంభంలో ఎవరు టాప్‌ దర్శకుడైతే వాళ్లతో సినిమా చేస్తే బాగుండేది అనుకునేవాణ్ని. తర్వాత పరిస్థితి అర్థమైంది" అంటూ కథానాయకుడు శ్రీ విష్ణు తన సినీ ప్రయాణం గురించి చెప్పారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి శ్రీ విష్ణు, దర్శకుడు అనిల్‌ రావిపూడి అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో తనకు ప్రోత్సాహం అందించిన నటులు, హీరో కాకముందు ఏం చేశారు? ఎక్కువ సార్లు చూసిన సినిమా? నిర్మాతగా తన భార్య ఏ చిత్రాలు రూపొందించారు? తదితర విషయాలు పంచుకున్నారు విష్ణు. రచయితగా తొలిసారి ఏ సినిమాకు పనిచేశారు?, 'గాలి సంపత్‌' చిత్రానికి ఆ పేరేందుకు పెట్టారో వివరించారు అనిల్‌ రావిపూడి.

శ్రీ విష్ణుని అడిగే ప్రశ్నలకు అనిల్‌ చెప్పే సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి. సినీ రంగంలో ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది..? శ్రీ విష్ణు వివాహం ఎలా జరిగింది? తెలుసుకోవాలని ఉందా..? అయితే మార్చి 15వ తేదీ 9:30గంటల వరకు వేచి చూడాల్సిందే. మరి అప్పటిదాకా ఈ ప్రోమోను చూసేయండి!

ABOUT THE AUTHOR

...view details