జబర్దస్త్ ఆన్‌స్క్రీన్ లవ్‌బర్డ్స్ ఇమ్మాన్యుయేల్, వర్ష పెళ్లి పీటలు ఎక్కారు. హైపర్ ఆది, రాంప్రసాద్ తదితరుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది నిజం పెళ్లి కాదండోయ్. ప్రతి ఆదివారం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం సహా ప్రతిభావంతులను పరిచయం చేస్తున్న ఎంటర్‌టైన్మెంట్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sri Devi Drama company) షోలో వీరు పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమం జులై 4న ప్రసారం కానుంది. అప్పటివరకు ప్రోమో చూసేయండి.
ఇమ్మాన్యుయేల్-వర్ష: పెళ్లిపీటలెక్కిన 'జబర్దస్త్' జోడీ! - శ్రీదేవీ డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో
జబర్దస్త్ జోడీ ఇమ్మాన్యుయేల్, వర్షకు పెళ్లి జరిగింది. హైపర్ ఆది, రాంప్రసాద్ తదితరుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. అసలు కథేంటంటే?

మరోవైపు వచ్చే ఆదివారం(జూన్ 27) ప్రసారం కానున్న ఈ షోలో అలరించే స్కిట్‌లతో పాటు, బల్వీర్ ఆలపించిన ఫోక్‌లను కూడా ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలనాటి నటి అన్నపూర్ణమ్మ వేసిన పంచ్‌లకు ఆది, రాంప్రసాద్‌లతో పాటు, లేడీ ఆర్టిస్ట్‌లకు కూడా దిమ్మ తిరిగిపోయింది. గతంలో, ఇప్పుడు చిన్నారులకు నీళ్లు ఎలా పోస్తున్నారనే దానిపై ఇమ్మాన్యుయేల్ స్కిట్ కితకితలు పెడుతోంది. ఇక ఈసారి 1980 థీమ్‌తో చేసిన స్కిట్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. పూర్తి ఎపిసోడ్ చూడాలంటే జూన్ 27వ తేదీ వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఈ ప్రోమోను చూసేయండి.
ఇదీ చూడండి: Sridevi drama company:తండ్రీ కొడుకుల ఫన్ హంగామా