తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమా స్టైల్​లో శ్రీదేవి-బోనీకపూర్​ ప్రేమాయణం - శ్రీదేవీ బోనీకపూర్​ ప్రేమ

చిత్రసీమలో ఎన్నో స్టార్​ కపుల్స్​ ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నవారే. వారిలో అతిలోక సుందరి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్​లది ఓ జంట. వీరి ప్రేమాయణం ఎలా సాగింది? ఎప్పుడు, ఎలా పెళ్లి చేసుకున్నారు? లాంటి విశేషాల సమాహారమే ఈ కథనం.

Sri Devi bony kapoor love journey
శ్రీదేవి బోనీ

By

Published : Nov 27, 2020, 5:32 PM IST

శ్రీదేవి ఎందరో అభిమానుల కలల రాణి. తెరపైన అందంతో ఎన్నో హృదయాల్ని కొల్లగొట్టిన ఓ అపురూప తారక. ఆమె కోసమే సినిమా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుడి దగ్గర్నుంచి, ఆమెను కలవడం కోసమే దర్శకుడుగా మారినవాళ్లూ ఉన్నారు. ఆఖరికి జీవితాన్ని పంచుకున్న బోనీకపూర్‌ కూడా తెరపైన శ్రీదేవి అందాన్ని చూసే తొలిసారి ప్రేమలో పడిపోయారు. అప్పటికే నిర్మాత అయిన ఆయన.. ఈ అప్సరసకు దగ్గరయ్యేందుకే ఓ సినిమా కోసం రూ.10 లక్షలు పారితోషికం ఇవ్వాల్సిన చోట రూ. 11 లక్షలు ఇచ్చేశారు. అసలు వీరి ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం.

శ్రీదేవి బోనీ

అలా ప్రేమలో

1970లోనే శ్రీదేవితో ప్రేమలో పడిపోయారు బోనీ కపూర్‌. ఓ తమిళ సినిమా చూసి ఆమెను ఎలాగైనా కలవాలనుకున్నారు. అందుకోసం బొంబాయి నుంచి మద్రాసు బయల్దేరారు. కానీ అప్పటికే శ్రీదేవి ఓ సినిమా షూటింగ్ కోసం సింగపూర్‌ వెళ్లినట్టు తెలిసింది. దీంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొన్నిరోజుల తర్వాత బొంబాయిలో ఆమె ఓ సినిమా చిత్రీకరణలో ఉందని తెలిసి అక్కడికి వెళ్లారు. కానీ వారిద్దరికి పరిచయం లేకపోవడం వల్ల ముక్తసరిగానే మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత శ్రీదేవితో సినిమా తీయాలని నిర్ణయించుకున్న బోనీ.. ఆమెతో అదే విషయం చెప్పారు. తనకు సంబంధించిన విషయాలన్నీ అమ్మే చూసుకుంటుందని చెప్పడం వల్ల, శ్రీదేవి తల్లిని ఆయన సంప్రదించారు. ఆమె రూ.10 లక్షలు పారితోషికం అడిగారట. శ్రీదేవికి దగ్గరవడమే ముఖ్యమనుకొన్న బోనీ, రూ. 11 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నారు. అలా తాను నిర్మించిన 'మిస్టర్‌ ఇండియా' కోసం శ్రీదేవిని ఎంపిక చేసుకున్నారు. అప్పట్లో రూ. 11 లక్షలు పారితోషికం చాలా ఎక్కువ. పారితోషికమే కాదు... అప్పట్లోనే ఆమె కోసం కార్‌వ్యాన్‌ ఏర్పాటు చేయడం సహా ప్రత్యేకంగా మేకప్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేశారు. ఆ సినిమా ప్రయాణంలోనే శ్రీదేవిపై ఉన్న తన ప్రేమను ఆమె ముందు వ్యక్తం చేశారు. 'చాందిని' చిత్రం సమయంలో ఇద్దరి మధ్య అనుబంధం మరింతగా పెరిగింది. 1996లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

బోనీ కపూర్‌కు అంతకు ముందు మోనాకపూర్‌తో వివాహమైంది. ఆమెకు విడాకులిచ్చి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరి జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉన్నారు. 'శ్రీ వచ్చాక నా జీవితమే మారిపోయింది' అని పలు సందర్భాల్లో బోనీకపూర్ చెప్పారు‌.

ఇదీ చూడండి: శ్రీదేవి : బాలనటి నుంచి అతిలోకసుందరిగా

ABOUT THE AUTHOR

...view details