నూతన దర్శకుడు కిశోర్ బి దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీకారం' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి వ్యాఖ్యాతగా శర్వానంద్, ప్రియాంక, నరేష్, దర్శకుడు కిశోర్ ఈ చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
'శ్రీకారం' ముఖ్య ఉద్దేశం అదే: శర్వానంద్ - sreekaram saptagiri
చదువుకున్న యువత వ్యవసాయం చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేయడమే తన సినిమా 'శ్రీకారం' ముఖ్య ఉద్దేశమని తెలిపారు హీరో శర్వానంద్. యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది.
శ్రీకారం
చదువుకున్న యువత వ్యవసాయ రంగంలో అడుగుపెడితే ఎలాంటి మార్పులు వస్తాయో ఈ చిత్రంలో చూపించినట్లు తెలిపారు యువ కథానాయకుడు శర్వానంద్. రైతుల కష్టాలు, ప్రభుత్వ విధానాలు తమ సినిమాలో కనిపించవని చెప్పిన ఆయన.. ఈ చిత్రం కోసం నిజంగానే వ్యవసాయం చేసినట్లు వివరించారు. యువత వ్యవసాయ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: 'శ్రీకారం'.. గొప్ప సందేశమిచ్చే చిత్రం: చిరు