*భవిష్యత్‌లో ప్రపంచానికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య వ్యవసాయమేనని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. వ్యవసాయ నేపథ్య కథతో శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం టైటిల్ సాంగ్‌ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. మార్చి 11న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
*దక్షిణాదిలో బురద రేసింగ్ నేపథ్య కథతో వస్తున్న తొలి చిత్రం 'మడ్డీ'. డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ వేసవిలో 5 భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి.