నిజాయతీగా కథ చెప్పే మరో దర్శకుడు కిశోర్‌ను సినీపరిశ్రమకు అందించిన 'శ్రీకారం' చిత్ర నిర్మాతలకు ప్రముఖ దర్శకులు బాబీ, అజయ్ భూపతి, గోపీచంద్ మలినేని ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. సినిమా కోసం వ్యవసాయం చేసిన నిర్మాతలను చూడటం పరిశ్రమలో ఇదే మొదటిసారని అన్నారు. 'శ్రీకారం' చిత్రాన్ని సామాన్య ప్రేక్షకుడిగా చూసి ప్రత్యేకంగా అభినందించారు.
'శ్రీకారం' నిర్మాతలపై దర్శకుల ప్రశంసలు - sreekaram news
'శ్రీకారం' నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన టాలీవుడ్ దర్శకుడు బాబీ, అజయ్, గోపీచంద్.. సినిమా తమకు బాగా నచ్చిందని తెలిపారు. ప్రతి యువకుడు చిత్రాన్ని చూడాలని అన్నారు.
శ్రీకారం నిర్మాతలకు దర్శకుల కృతజ్ఞతలు
గ్రామాల్లో రైతుల పరిస్థితికి అద్దంపట్టే ప్రతి సన్నివేశం తమనెంతో కలిచివేసిందన్న గోపీచంద్.. 'శ్రీకారం' చిత్రాన్ని ప్రతి యువకుడు బాధ్యతగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సినిమాలో శర్వానంద్, ప్రియాంక హీరోహీరోయిన్లుగా నటించారు. ఉమ్మడి వ్యవసాయం నేపథ్య కథతో 'శ్రీకారం' ప్రేక్షకుల ముందుకొచ్చింది.