తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎస్​ఆర్ కల్యాణమండపం' ట్రైలర్​.. 'శ్రీదేవి' పరిచయం ఎప్పుడంటే?

టాలీవుడ్​ కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'ఎస్​ఆర్ కల్యాణమండపం' ట్రైలర్​, 'స్టాండప్​ రాహుల్​' తొలి లిరికల్ సాంగ్​, 'శ్రీదేవి సోడా సెంటర్​', 'రాజరాజచోర' సినిమా అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

'SR Kalyanamandapam' movie trailer out
'ఎస్​ఆర్ కల్యాణమండపం' ట్రైలర్​.. 'శ్రీదేవీ' పరిచయం ఎప్పుడంటే?

By

Published : Jul 28, 2021, 9:20 PM IST

"పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపున పుట్టినవాడు కూడా మనకు విలువివ్వడు" అని అంటున్నారు నటుడు సాయికుమార్‌. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం 'ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం'. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జువాల్కర్‌ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

'స్టాండప్​ రాహుల్​' సాంగ్​

రాజ్ ​తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'స్టాండప్ రాహుల్'. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోని 'అలా ఇలా' అనే పాటను జులై 3న ఉదయం 9.18 నిమిషాలకు విడుదల చేయనున్నారు యువ హీరో విజయ్ దేవరకొండ. స్టాండప్ కామెడీ నేపథ్య కథతో, రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సాంటో దర్శకత్వం వహించారు.

'స్టాండప్ రాహుల్' లిరికల్​ సాంగ్​ అప్​డేట్​

'శ్రీదేవి' పరిచయం

కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. తాజాగా ఈ సినిమాలోని సోడాల శ్రీదేవి పాత్రను జులై 30న ఉదయం 10 గంటలకు పరిచయం చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

'శ్రీదేవి సోడా సెంటర్​' సినిమా అప్​డేట్​

'రాజరాజచోర' సాంగ్​

శ్రీవిష్ణు దొంగగా నటిస్తున్న 'రాజ రాజ చోర' చిత్రంలోని 'ది చోర' లిరికల్​ సాంగ్​ను చిత్రబృందం విడుదల చేసింది. మేఘా ఆకాశ్​, సునైనా హీరోయిన్లు. హాసిత్​ గోలి దర్శకుడు. ఇటీవలే విడుదలైన టీజర్​ అలరిస్తుంది.

ఇదీ చూడండి..అందంలో ఆహా.. అంతర్జాలంలో వారెవా!

ABOUT THE AUTHOR

...view details