*కిరణ్, ప్రియాంక జావల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఎస్.ఆర్.కల్యాణ మండపం'. ఈ సినిమాను ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సాయికుమార్ ఇందులో కీలకపాత్ర పోషించారు. శ్రీధర్ దర్శకత్వం వహించారు.
*విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న 'ఎనిమీ' చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన విశాల్.. చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
*విక్రాంత్ మాస్సే, కృతి కర్బందా జంటగా నటించిన '14 ఫెరే' చిత్ర ట్రైలర్ రిలీజైంది. నేరుగా ఓటీటీలో ఈనెల 23న విడుదల కానుంది. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
*సుధీర్‌బాబు మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. నటుడు హర్షవర్ధన్.. ఈ చిత్రం కోసం దర్శకుడిగా మారారు. మరోవైపు ఆదిసాయికుమార్ 'కిరాకత' కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆ ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇవీ చదవండి: