IMDB rating The Kashmir files: 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాతో సినీప్రియులను మెప్పించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన తెరకెక్కించిన కొత్త చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన దాడులు.. వారిపై సాగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో పాటే ఓ ఘనతను అందుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది. 10/10 రేటింగ్‌ను అందుకుంది.
కశ్మీర్‌లోని తీవ్రవాదులు, వేర్పాటువాదుల దాడుల వల్ల ఓ సామాజిక వర్గం ఎలా అంతమైందో ఈ సినిమాలో భావోద్వేగభరితంగా చూపించారు. కాగా, ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.