తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'స్పైడర్​మ్యాన్' విడుదల తేదీ ఖరారు - cinema

టామ్ హోలండ్ ప్రధానపాత్ర పోషిస్తోన్న 'స్పైడర్​మ్యాన్ : ఫ్యార్ ఫ్రమ్ హోమ్' చిత్రం జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్పైడర్​మ్యాన్

By

Published : Jun 25, 2019, 7:37 PM IST

హాలీవుడ్​లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో 'స్పైడర్​మ్యాన్' ఒకటి. ఇండియాలోనూ ఈ సూపర్​హీరోకు భారీగానే అభిమానులున్నారు. ఈ సిరీస్​ నుంచి వస్తోన్న తాజా చిత్రం 'స్పైడర్​మ్యాన్: ఫ్యార్ ఫ్రమ్ హోమ్'. ఈ సినిమాను జులై 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

భారత్​లో సోనీ పిక్చర్స్ ఎంటర్​టైన్​మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఇంతకుముందు జులై 5న విడుదల చేస్తామని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల ఒకరోజు ముందుకు జరిపారు. ఇంగ్లీష్​తో పాటు హిందీ, తెలుగు, తమిళంలోనూ ప్రేక్షకులముందుకు రానుంది. అడ్వాన్స్​ బుకింగ్స్​ జూన్ 30 నుంచి ప్రారంభంకానున్నాయి.
ఈ చిత్రంలో స్పైడర్​మ్యాన్ పాత్రను టామ్ హోలండ్ పోషిస్తుండగా.. జాన్ వాట్స్​ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవీ చూడండి.. మెటాలిక్ దుస్తుల్లో మెరిసిపోతున్న దీపికా పదుకునే

ABOUT THE AUTHOR

...view details