తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సైరా కోసం స్పైడర్​మ్యాన్ కెమెరాలు వాడారంట! - chiru

సైరా చిత్రం కోసం ప్రత్యేక కెమెరాలు వాడినట్లు చెప్పాడు ఆ సినిమా ఛాయాగ్రాహకుడు రత్నవేలు. హాలీవుడ్ సినిమాలకు ఉపయోగించే కెమెరాలను తెప్పించామని, ప్రత్యేకంగా స్పైడర్​క్యామ్​ను రష్యా నుంచి దిగుమతి చేశామని తెలిపాడు.

సైరా

By

Published : Sep 16, 2019, 5:16 AM IST

Updated : Sep 30, 2019, 6:52 PM IST

సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ సినిమా ప్రచార సందడి మొదలైంది. ఈ చిత్రం ఛాయాగ్రాహకుడు(కెమెరామన్) రత్నవేలు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సైరా కోసం ప్రత్యేక కెమెరాలు వాడామని, ముఖ్యంగా పోరాట ఘట్టాల కోసం స్పైడర్​మ్యాన్ చిత్రానికి ఉపయోగించిన స్పైడర్ క్యామ్​ను ఉపయోగించినట్లు తెలిపాడు.

"ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో సైరానే ప్రత్యేకం. ఈ చిత్రం కోసం హాలీవుడ్ సినిమాలకు వాడే మూవీ ప్రో, ఎక్సెల్ మౌంట్‌ కెమెరా, బ్లాక్‌ క్యామ్ ఏటిీవి, స్పైడర్‌ క్యామ్‌ వంటివి ఉపయోగించాం. ఇందులో స్పైడర్​క్యామ్ అతి ముఖ్యమైనది. గుర్రాలు అనూహ్య వేగంతో పరిగెడుతున్నప్పుడు దగ్గరి నుంచి చిత్రీకరించలేం. అందుకోసం స్పైడర్​ క్యామ్​ను తెప్పించాం." -రత్నవేలు, కెమెరామన్

స్పైడర్​ క్యామ్​.. తాడును ఆధారంగా చేసుకుని పై నుంచి వేలాడుతూ చిత్రీకరిస్తుందని చెప్పాడు రత్నవేలు.

"స్పైడర్​క్యామ్​ను ఎక్కువగా క్రికెట్ మ్యాచ్​లప్పుడు చూడొచ్చు. తాడును ఆధారంగా చేసుకుని గ్రౌండ్‌లో పై నుంచి వేలాడుతూ చిత్రీకరిస్తుంటుంది. అదే పద్ధతిలో గుర్రాల పోరాట ఘట్టాలను తెరకెక్కించాం. చుట్టూ నాలుగు భారీ క్రేన్లను ఏర్పాటు చేసి యుద్ధ సన్నివేశాలను తీశాం. రష్యా నుంచి ఈ పరికరాన్ని దిగుమతి చేసుకున్నాం. జార్జియా షెడ్యూల్​ను ఈ కెమెరాతో చిత్రీకరించాం" -రత్నవేలు, కెమెరామన్

ఈ నెల 18న ప్రీ రిలీజ్ వేడుకకు రంగం సిద్ధం చేసింది సైరా చిత్రబృందం. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్​ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్​చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార ఇందులో కథానాయిక. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

ఇదీ చదవండి: 'పూర్తి స్వేచ్ఛనిచ్చే దర్శకుడు గౌతమ్​ మీనన్'

Last Updated : Sep 30, 2019, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details