తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు 'ఆచార్య' విడుదల ఎప్పుడు? - ఆచార్య మూవీ స్టోరీ

ఆచార్య మూవీ రిలీజ్ డేట్​​పై ఈ వారాంతంలో ఓ ప్రకటన రానుందనే ఊహాగానాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్​ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Acharya movie
ఆచార్య మూవీ

By

Published : Aug 7, 2021, 9:51 AM IST

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి కథానాయకునిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం దేవాలయాలు, నక్సలైట్ల నేపథ్య కథాంశంతో నడుస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, లుక్స్​.. అభిమానుల్ని అలరిస్తూ అంచనాల్ని పెంచేస్తున్నాయి. చివరి షెడ్యూల్​ను కూడా పూర్తి చేసింది చిత్ర బృందం. అయితే సినిమా విడుదల​ ఎప్పుడా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే.. దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ వారంతంలో రిలీజ్​ డేట్​ను ప్రకటించనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. సినిమా ఈ ఏడాదే రిలీజ్​ అవుతుందా? లేదా వచ్చే ఏడాదిలోనా? అన్నది తెలియాల్సి ఉంది.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మ్యాట్నీ ఎంటర్​టైన్మెంట్స్​ నిర్మిస్తోంది.

ఇదీ చదవండి:చిరుకు చెల్లెలిగా టాప్​ హీరోయిన్​!

ABOUT THE AUTHOR

...view details