కథానాయకుడి పుట్టినరోజు వస్తోందంటే చాలు...అభిమానుల్లో జోష్ నింపడానికి చిత్రబృందాలు ప్రత్యేకప్రయత్నాలు చేస్తుంటాయి. కొత్త సినిమాల ప్రచార చిత్రాలో లేదంటే, కొత్త సినిమా ప్రకటనలో, పాటలో విడుదల చేస్తూ ఊరిస్తుంటాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా స్వరాల సందడి వినిపించబోతున్నారు. ఈ నెల 9న ఈ కథానాయకుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'కు సంబంధించిన టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
మహేశ్ పుట్టినరోజున సర్కారు వారి సందడి - మహేశ్ సర్కారు వారి పాట వార్తలు
హీరో మహేశ్‌బాబు పుట్టినరోజైన ఆగస్టు 8న, అతడి కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. దీనితో పాటే మరో కొత్త సినిమా ప్రకటన కూడా ఉండనుందట.
మహేశ్‌బాబు
ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. తమన్ సంగీతమందిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. ఇందులో మరో హీరోయిన్‌కు చోటుందట. ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం చిత్రబృందం కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. మహేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అతడు చేయబోయే మరో కొత్త చిత్రాన్నీ ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం.