తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బుసలు కొట్టే అందం.. మల్లిక సొంతం..! - mallika hiss

ఐటెమ్​ సాంగ్స్​తో ఊపేసి.. అందాలతో అదరగొట్టి.. సెక్స్ సింబల్​గా​ గుర్తింపు తెచ్చుకున్న నటి.. మల్లికా శెరావత్​. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో తన నటనతో.. అందంతో ఆకట్టుకున్న మల్లిక పుట్టినరోజు నేడు.

మల్లికా శెరావత్

By

Published : Oct 24, 2019, 11:05 AM IST

మల్లికా శెరావత్​.. మత్తెక్కించే అందం.. మైమరిపించే సొగసు.. తెరపై కనిపిస్తే తేరుకోవడం కష్టమే.. కుర్రకారుకు నిద్రలేని రాత్రులు మిగిల్చి.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు బుసలు కొట్టే అంద చందాలతో బానిసలను చేసింది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మల్లికపై ఓ లుక్కేద్దాం!

చిన్నప్పట్నుంచే..

హరియాణాలోని జాట్ల​ కుటుంబంలో 1976 అక్టోబరు 24న జన్మించింది మల్లిక. తండ్రి ముఖేష్‌ కుమార్‌ లాంబా. సొంత ఊరు రొహ్తక్‌. మధుర రోడ్‌ని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకొంది. దిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫిలో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పట్నుంచి స్వతంత్ర భావాలతో పెరిగింది.

మల్లిక కాదు..రీమా

మల్లికా శెరావత్‌ అసలు పేరు రీమా లాంబా. రీమా పేరుతో చాలామంది కథానాయికలు ఉన్నారని తను మల్లికా శెరావత్‌ అని మార్చుకొంది. మల్లిక అనేది తన సొంత ఆలోచనే అయినా..శెరావత్‌ అన్నది మాత్రం మల్లికా తల్లి ఇంటి పేరట. తన ఇష్టాయిష్టాలను తెలుసుకొని నటిగా ఎదగడానికి తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతుంటుంది మల్లిక. అందుకే ఆమె ఇంటి పేరును తన పేరు చివర చేర్చుకొందట.

గాల్లో తేలింది..

నటి కాకముందు..మల్లికా శెరావత్‌ ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసింది. అక్కడే తనకి సినీయర్‌ కెప్టెన్‌గా పనిచేసిన కరణ్‌సింగ్‌ గిల్‌ను వివాహం చేసుకొంది. ఆ తరువాత మోడలింగ్‌ రంగంపై దృష్టి పెట్టింది. షారుఖ్‌ ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌లాంటి కథానాయకులతో కలిసి వ్యాపార ప్రకటనల్లో నటించే అవకాశం అందుకొంది.

తొలి అవకాశం..

మోడలింగ్‌ రంగంలో కొనసాగుతూనే సినిమా అవకాశాలపై దృష్టి పెట్టింది మల్లిక. 2002లో జీనా సిర్ఫ్‌ మేరే లియే అనే చిత్రంలో తొలి అవకాశాన్ని అందుకొంది. అందులో కనిపించేది కొద్దిసేపే అయినా..మల్లిక పరిశ్రమ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ సినిమా నుంచి అవకాశాలు వరుసకట్టాయి.

సెక్స్​ సింబల్‌..

మల్లిక హవా 2003 నుంచి మొదలైందని చెప్పొచ్చు. ఆమె నటించిన ఖ్వాషిప్‌ చిత్రం అదే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఘన విజయం సాధించింది. ఆ వెంటనే మర్డర్​లో నటించింది. అందులో మల్లిక..ఇమ్రాన్‌ హష్మితో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. మల్లిక ‘సెక్స్‌ సింబల్‌’ అనే గుర్తింపు ఈ చిత్రంతోనే సొంతం చేసుకొంది.

అడ్డుకున్నారు..

మల్లికా శెరావత్‌ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడం కుటుంబంలో ఎవ్వరికి ఇష్టం లేదు. హరియాణాలోని పేరున్న కుటుంబం కావడం వల్ల కుటుంబ సభ్యులు సినిమా రంగంలోకి వెళ్లకుండా తీవ్రంగా అడ్డుకున్నారు. అయితే మల్లిక మాత్రం వారందరిని ప్రతిఘటించి ముంబయి చేరుకుంది. ఆమె నటిగా పేరు తెచ్చుకొన్నాక..మళ్లీ కుటుంబం దగ్గరైంది.

నటిగానూ ఆకట్టుకుంది..

మల్లిక కేవలం అందాన్నే నమ్ముకోలేదు. తను చేసే ప్రతి సినిమాలోనూ నటిగా కూడా చక్కటి ప్రతిభ కనబరిచింది. భావోద్వేగాలు పండించడంలో తిరుగులేని నటిగా గుర్తింపును సంపాదించింది. ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌, వెల్‌కమ్’, అగ్లీ ఔర్‌ పగ్లి, మన్‌ గాయే మొఘల్‌ ఏ అజమ్‌, డబుల్‌ ధమాల్‌ తదితర చిత్రాల్లో మల్లిక నటనను విమర్శకుల ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌ చిత్రంలో ఆమె నటనకి మంచి ప్రశంసలు దక్కాయి.

ఐటెమ్‌ అదరహో..

మణిరత్నం..‘గురు’లో మయ్యా మయ్యా..అనే ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ తరువాత థ్యాంక్యూ, బిన్‌ బులాయే బంటి, తేజ్‌ తదితర చిత్రాల్లో ఆమె చేసిన ప్రత్యేక గీతాలు ఎంతగానో అలరించాయి. ఆప్‌ కా సురూర్‌ చిత్రంలో పదినిమిషాల పాత్ర కోసం ఏకంగా కోటిన్నర రూపాయలు పారితోషికం తీసుకుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. దక్షిణాదిలో దశవతారం, ఓస్తే చిత్రాల్లో మల్లిక నటించింది.

అంతర్జాతీయ స్థాయిలో..

తొలి అడుగుల్లోనే అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొంది మల్లిక. 2005లో ది మిథ్​ అనే చిత్రంలో జాకీచాన్‌తో కలిసి నటించింది. అందులో భారతీయ యువతిగానే కనిపించింది. ఆ తర్వాత హిస్‌, పాలిటిక్స్‌ లవ్‌ తదితర చిత్రాల్లోనూ నటించి పేరు తెచ్చుకొంది. ‘హిస్‌’ చిత్రం కోసం నిజమైన పాములతో సహవాసం చేస్తూ నటించింది.

అమెరికాలో గౌరవ పౌరసత్వాన్ని పొందింది మల్లిక. ఆమె నటనతో పాటు అక్కడ చేసిన సామాజిక సేవ కార్యక్రమాలకుగానూ అమెరికా ప్రభుత్వం మల్లికకు అమెరికా గౌరవ సభ్యత్వాన్ని అందజేసింది.

విజయ్‌సింగ్‌తో...

ది బ్యాచిలరేట్‌ ఇండియా..మేరీ ఖయాలన్‌ కీ మల్లికా పేరుతో ఓ రియాలిటి షోకి హోస్ట్‌గా వ్యవహరించింది మల్లిక. మొదటి భర్త కరణ్‌సింగ్‌ గిల్‌కు విడాకులిచ్చి.. లండన్​లో స్థిరపడ్డ భారతీయుడు విజయ్‌సింగ్​ను పెళ్లి చేసుకుంది.

2014లో 65 ఐక్యరాజ్య సమితి (డిపిఐ/ఎన్‌జీఓ) కాన్పరెన్స్‌లో మహిళ హక్కుల గురించి చర్చించింది మల్లిక. భారత్​కు మద్దతుగా కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ (2018)లో మహిళా హక్కుల కోసం ‘ఫ్రీ గర్ల్‌ ఇండియా ఎన్‌జీఓ సంస్థ తరపున హాజరై తన గళాన్ని వినిపించింది మల్లిక.

ఇదీ చదవండి: సల్మాన్​కు అప్పట్లో ఆ మూడ్ లేదంట..!

ABOUT THE AUTHOR

...view details