సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందించిన చిత్రం 'వన్ నేనొక్కడినే'. ఈ చిత్రాన్ని ఇప్పటికి కూడా టాలీవుడ్లో మోస్ట్ ఇంటెలిజెంట్ స్క్రిప్ట్‌గా పరిగణిస్తున్నారు. అలాంటి అద్భుతమైన కథను ప్రేక్షకులకు అందించిన రచయిత హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'ప్లేబ్యాక్'. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 5 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.
'వన్ నేనొక్కడినే'కు కథ.. 'ప్లే బ్యాక్'తో దర్శకుడిగా - హరి ప్రసాద్ జక్కా ప్లేబ్యాక్ మూవీ
'వన్ నేనొక్కడినే' కథ అందించిన హరిప్రసాద్ జక్కా తీసిన చిత్రం 'ప్లేబ్యాక్'. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను క్రాస్ టైమ్ కనెక్షన్ అనే వినూత్న అంశంతో రూపొందించారు.
అయితే భారతీయ సిని ఇండస్ట్రీల్లోనే ఇది సరికొత్త కథ అని చిత్రబృందం చెబుతోంది. క్రాస్ టైమ్ కనెక్షన్ మీద ఇప్పటివరకు ఏ చిత్రం రాలేదని, కచ్చితంగా ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు నూతన కథా వస్తువు పరిచయం అవుతుందని అంటుంది.
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో హుషారు సినిమా ఫేమ్ దినేశ్ తేజ్ , మల్లేశం సినిమా ఫేమ్ అనన్య హీరోహీరోయిన్లుగా నటించారు. దీనిని తెరకెక్కించిన దర్శకుడు హరిప్రసాద్.. ఇంతకుముందు 'వన్ నేనొక్కడినే'కి కథ అందించడం సహా 100% లవ్ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. సుకుమార్ రైటింగ్స్‌లో 'దర్శకుడు' చిత్రానికి దర్శకత్వం వహించారు.