ఒక నవల(kondapolam novel)... సినిమాగా వచ్చి ఎన్ని రోజులైంది? మట్టి పరిమళాన్ని వెండితెర అద్దుకొని ఎన్నేళ్లైంది? మనిషి తనకు అనుకూలంగా ప్రకృతిని ఎలా మార్చుకుంటున్నాడో... అలా ప్రకృతి కూడా మనిషిని మలుస్తుందని ఎంతమందికి తెలుసు? ఏ మనిషికైనా చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులకన్నా గురువులెవరుంటారు? వీటన్నింటికీ సమాధానం చెబుతూ వస్తోంది 'కొండపొలం' చిత్రం(kondapolam movie). ఇదే పేరుతో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. పంజా వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్(vaishnav tej kondapolam) నాయకానాయికలు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరకల్పన చేసిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
'కొండపొలం'(kondapolam story) నవల చదివిన దర్శకుడు క్రిష్ ఒకసారి నాకు ఫోన్ చేశారు. ఆయన ఇంటికి ఆహ్వానించారు. అక్కడ ఈ నవల గురించి మొదటిసారి మేమిద్దరం చర్చించుకున్నాం. 'నవలలోని సారాన్ని ఏ మాత్రం తీసేయకుండా... కొన్ని మార్పులు చేర్పులతో సినిమా చేయాలనుకుంటున్నాం' అన్నారు. నేను అంగీకరించాను. దానికి తగ్గట్లే తీశారు. పుస్తకం చదివిన పాఠకుడు ఎంత సంతృప్తి పడతాడో... సినిమా చూసిన ప్రేక్షకులూ అంతే ఆనందాన్ని పొందుతారు.
మనం భూమిని సాగుచేసి పంటను పండిస్తే... దాన్ని పొలం అంటాం. అదే సహజసిద్ధంగా ప్రకృతే పంటను ఇచ్చే ప్రదేశాన్ని 'కొండపొలం' అంటాం(kondapolam movie poster). అడవిలో ఆ ఫలాన్ని పొందడానికి గొర్రెల కాపారుల చేసే ప్రయాణాన్నే 'కొండపొలం' అంటారు. ఈ పదం కడపజిల్లా పోరుమామిళ్ల, జ్యోతి... ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో వారికే తెలుసు. మొదట సినిమాకు 'వనవాసి' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. స్థానికతను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుండటం వల్ల చివరికి దర్శకుడు క్రిష్ 'కొండపొలం' అనే టైటిల్ ఖరారు చేశారు.