చిన్నోడు పెద్దోడు మళ్లీ కలిశారు. అదేనండి చిన్నోడంటే మహేశ్.. పెద్దోడంటే వెంకటేశ్.. అయితే ఈసారి సినిమా కోసం కాదు.. చిత్ర ప్రచారం కోసం కలిసి సందడి చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' ప్రచారంలో భాగంగా దర్శకుడు అనిల్‌తో కలిసి ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ చిత్రంలో మైండ్ బ్లాక్ సాంగ్‌పై మీ స్పందన ఏంటని దర్శకుడు అనిల్ అడగ్గా.. ఇలాంటి పాటలో మహేశ్‌ను చూడాలని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారని వెంకీ బదులిచ్చాడు.
"నువ్వు(అనిల్ రావిపూడి) లుంగీతో వేయించావమ్మా. అక్కడ ఆడవాళ్లంతా ఔట్. సాధారణంగా హీరోయిన్లను అలా చూస్తాం. కానీ, మహేశ్ ఇంకెప్పుడు కొంచెం లుంగీ పైకిలేపుతాడా, కాళ్లు కనపడతాయా అని చూశారు. మైండ్ బ్లాక్ స్టెప్స్ కూడా భలే కుదిరాయి" - వెంకటేశ్