ఆనంద్ దేవరకొండ, శివాత్మికా రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'దొరసాని'. జులై 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నేటి తరాన్ని తెలంగాణ యాసతో ఆకట్టుకుంటూ అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టింది దొరసాని చిత్రం. సినిమా హీరో హీరోయిన్లు..ఈటీవీ భారత్‌తో పలు విషయాలను పంచుకున్నారు.
సినిమా నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా... ఆ ఇమేజ్‌ని పక్కన పెట్టి తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు 'దొరసాని' అంటూ తొలిప్రయత్నం చేశారు ఆనంద్ దేవరకొండ, శివాత్మికా రాజశేఖర్.