ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన నిదానంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. ఎస్పీ బాలు చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని తెలిపారు చరణ్.
నిదానంగా కోలుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు - spb-health-update latest news
కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెల్లగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తాజాగా బాలు ఆరోగ్య విషయమై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు.
![నిదానంగా కోలుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు sp balu latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8654083-1103-8654083-1599051531202.jpg)
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు ఎస్పీబీ. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన పరిస్థితి విషమించడం వల్ల.. ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. ఆ తర్వాత నుంచి ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు.