దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన విగ్రహాన్ని ముందే తయారు చేయించుకున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వుడయార్‌ను తన విగ్రహాన్ని రూపొందించాలని కోరారు. మొదట నెల్లూరు జిల్లాలోని స్వగృహంలో తన తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టాలనుకున్న బాలు...వాటిని కొత్తపేటలోనే తయారు చేయించారు. విగ్రహాలు పూర్తయ్యాక వాటిని చూసి బాలు ఎంతో ఆనందపడ్డారు. చాలా బాగా చేశారండి అని శిల్పిని ప్రశంసించారు.
ముచ్చటపడి విగ్రహం చేయించుకున్నారు... చూడకుండానే దివికేగారు
40 వేల పైచిలుకు పాటలను మనకే వదిలేసి మరో లోకానికి మరలి వెళ్లారు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. ఆయన గగనానికేగిన తరువాత ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్పీబీ ముందుగానే తన విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ఓ శిల్పితో తయారు చేయించుకున్నారు. కానీ దానిని చూడకముందే తుదిశ్వాస విడిచారు.
వుడయార్ శిల్పకళా ప్రతిభ బాలును ఎంతగానో ఆకర్షించింది. కొన్నాళ్లు శిల్పశాలతో తన అనుబంధాన్ని ఆయన కొనసాగించారు. లాక్‌డౌన్‌కు ముందు వుడయార్‌ను తన విగ్రహాన్ని కూడా తయారుచేయాలని బాల సుబ్రహ్మణ్యం కోరారు. దానికి ఒప్పుకున్న వుడయార్... ఇటీవల బాలు విగ్రహాన్ని పూర్తి చేశారు. కానీ తల్లిదండ్రుల విగ్రహాలు ఆవిష్కరించకుండా.... ఇష్టపడి చేయించుకున్న తన విగ్రహాన్ని చూసుకోకుండానే బాలు కన్నుమూశారని శిల్పి వుడయార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఎడతెరిపిలేకుండా వాన.. చెరువులను తలపిస్తోన్న కాలనీలు