కరోనా వైరస్‌తో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు ఆయన తనయుడు చరణ్ వెల్లడించారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఫిజియోథెరపీ కొనసాగుతోందని తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగుతోందని అన్నారు. తన తండ్రికి వైద్యసేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్య బృందానికి, ఎస్పీబీ కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నాన్న ఆరోగ్యం మెరుగుపడుతోంది: ఎస్పీ చరణ్ - ఎస్పీ బాలుసుబ్రహ్మణ్యం
తన తండ్రి ఎస్పీ బాలు నిలకడగానే ఉన్నారని, రోజురోజుకు ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన కుమారుడు చరణ్ ట్వీట్ చేశారు.
ఎస్పీ చరణ్, ఎస్పీ బాలు
కరోనా సోకడం వల్ల ఆగస్టు 5న బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఒకానొక దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల వైద్యులు వెంటిలేటర్, ఎక్మోసాయంతో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడం వల్ల అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.