ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుత ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ చెప్పారు. గత 48 గంటల నుంచి పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. నాన్న కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
బాలు ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు ఎస్పీ చరణ్ - sp balu latest news
సింగర్ బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుమారుడు ఎస్పీ చరణ్ చెప్పారు. ఆయన కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
గాయకుడు ఎస్పీ బాలు
కరోనాతో బాధపడుతూ ఆగస్టు 5న బాలు, చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్ప్రతిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఇటీవలే పరిస్థితి విషమించడం వల్ల ఎక్మో సహాయంతో వెంటిలేటర్‌పై ఉన్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.