తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాన్నను రెండు వారాల తర్వాత కలిశాను: ఎస్పీ చరణ్

ఎస్పీ బాలు ఆరోగ్య గురించి చెప్పిన కుమారుడు ఎస్పీ చరణ్.. ఆయనను రెండు వారాల తర్వాత కలిశానని, తనతో సంజ్ఞల ద్వారా మాట్లాడారని అన్నారు.

నాన్నను రెండు వారాల తర్వాత కలిశాను: ఎస్పీ చరణ్
ఎస్పీ చరణ్

By

Published : Aug 24, 2020, 10:31 PM IST

Updated : Aug 24, 2020, 10:36 PM IST

ఎస్పీ బాలు ఆరోగ్య గురించి చెప్పిన కుమారుడు ఎస్పీ చరణ్

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్. నాన్నను దాదారు రెండు వారాల తర్వాత కలిశానని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇన్​స్టా వీడియోలో వెల్లడించారు.

ఈరోజు ఉదయం నాన్నకు నెగటివ్ వచ్చిందనే వార్తలు అవాస్తవాలని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్న అందరి గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. సంజ్ఞల ద్వారా తనతో మాట్లాడారని, ఆయన గదిలో ప్లే చేసిన సంగీతానికి స్పందించారని చరణ్ వెల్లడించారు. త్వరలో తన తండ్రి కోలుకుంటారని, మనముందుకు వస్తారని చెప్పారు.

Last Updated : Aug 24, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details