తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది: ఎస్పీ చరణ్​ - sp charan latest news

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవలే కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి తనయుడు చరణ్ తాజాగా వివరణ ఇచ్చారు.

SP Charan About SP Balasubramaniam Health update
నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది: ఎస్పీ చరణ్​

By

Published : Aug 17, 2020, 4:57 PM IST

Updated : Aug 17, 2020, 6:39 PM IST

కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెల్లగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్​ వెల్లడించారు. ఆదివారం చికిత్స కోసం బాలును ఐసీయూలోకి మార్చగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఓ వీడియో ద్వారా తెలిపారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఆయన తనయుడు చరణ్​ వివరణ

"నాన్న ఆరోగ్యం ఆదివారం నుంచి నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యం క్లిష్టంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ, నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. అందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాన్న త్వరగా కోలుకోవాలని మీరంతా చేస్తున్న ప్రార్థనలు, మీరు మా కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఆయన త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు" అని ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్​ వెల్లడించారు.

విషమంగానే బాలు ఆరోగ్యం

"ప్రస్తుతం బాలు గారు వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది" అంటూ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Last Updated : Aug 17, 2020, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details