కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు చరణ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. తన తండ్రి కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నెమ్మదిగా కోలుకుంటున్న ఎస్పీ బాలు - ఎస్పీ బాలుకు కరోనా
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ చెప్పారు.
ఎస్పీ బాలు
నిన్నటితో పోలిస్తే తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కొత్త సమాచారం ఏమీ లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల మొదటి వారంలో ఎస్పీ బాలు కరోనా బారిన పడటం వల్ల ఆయన్ను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారు.
Last Updated : Aug 29, 2020, 8:22 PM IST