ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల వెంటిలేటర్‌పై ఎక్మో సహాయంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఎస్పీ బాలు
"కరోనాతో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు చికిత్స కొనసాగుతోంది. వెంటిటేలర్, ఎక్మో సహాయంతో ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగా ఉంది. మా వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. అదే విధంగా ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం" అని పేర్కొంది.