తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల

ప్రఖ్యాత సింగర్ ఎస్పీ బాలు, శుక్రవారం హెల్త్ బులెటిన్​ను వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

SP Balu Health Update: SP Balasubrahmanyam is 'conscious
గాయకుడు ఎస్పీ బాలు

By

Published : Aug 28, 2020, 7:17 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సంబంధించిన శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఎమ్​జీఎమ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఎక్మో సహాయంతో వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్

ఫిజియోథెరఫీ జరిగిన తర్వాత బాలు స్పందిస్తున్నారని చెప్పిన వైద్యులు.. మల్టీ డిసిప్లెనరీ క్లినికల్ బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు.

ఆగస్టు 5న కరోనాతో ఆస్పత్రిలో చేరిన బాలు.. అప్పటి నుంచి ప్రాణాంతక వైరస్​తో పోరాడుతూనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details