తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ 'సినిమా' పాట.. ఎస్పీ బాలు.. జాతీయ అవార్డు

ఎన్నో వేల పాటలు పాడి, తన గాన మధుర్యంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఎస్పీ బాలు.. ఓ సినిమాలో పాట పాడే అవకాశాన్ని తొలుత వద్దన్నారట. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని ఆ సినిమాలో పాడటమే కాకుండా ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇంతకీ బాలు ఎందుకు తిరస్కరించారు? కారణం ఏంటి?

SP balu got national award for sankarabharanam songs
ఎస్పీ బాలు

By

Published : Sep 25, 2021, 9:14 AM IST

సుప్రసిద్ధ గాయకడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. తన సినీ కెరీర్‌లో పాడిన పాటలన్నీ ఒకెత్తు.. 'శంకరాభరణం'లో ఆలపించిన గీతాలు మరొకెత్తు. పాశ్చాత్య సంగీత పెను తుపానుకు తట్టుకోలేక శాస్త్రీయ సంగీతం తన ఉనికిని కోల్పోతున్న తరుణంలో ఈ సినిమా పాటలు జనానికి శాస్త్రీయ సంగీతపు మధురిమలను రుచి చూపించింది. దీని తర్వాత ఎంతోమంది యువతీ యువకులు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారంటే, 'శంకరాభరణం' ఏస్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

శాస్త్రీయ సంగీతం ప్రధానాంశంగా విశ్వనాథ్‌ తీసిన ఈ చిత్రం కోసం బాలును గాయకుడిగా తీసుకున్నప్పుడు చాలామంది ముక్కున వేలేసుకున్నారు. సంగీతం నేర్చని ఆయనతో ఈ సినిమాలో పాటలు పాడిస్తున్నారంటే ఇక ఇది ఆడినట్టే అని పెదవి విరిచారు. బాలు పని అయిపోయినట్లే. మూటా ముల్లు సర్దుకోని నెల్లూరు కెళ్లి తండ్రిలాగే హరికథలు చెప్పుకోవాల్సిందేనని మరికొందరు అవహేళన చేశారు. కానీ వాస్తవమేమిటంటే ఈ సినిమాకు ఎస్పీబీని అనుకున్నప్పుడు తానూ ఈ చిత్రంలో పాటలు పాడేందుకు అంగీకరించలేదు.

ఎస్పీ బాలు

"నా వల్ల కాదు నన్నొదిలేయండి. ఇదసలే సంగీత ప్రధానమైన చిత్రం. దీన్ని సంగీతం పట్ల బాగా పట్టు ఉన్నవారితో పాడిస్తే బాగుంటుంది. నాలాంటి వ్యక్తితో పాడించొద్దు. ఒకవేళ ఈ అద్భుత కళాఖండానికి గాయకుడిగా నేను న్యాయం చేయలేకపోతే నా గతి ఏం కావాలి. నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే" అని బాలు జారుకునే ప్రయత్నం చేశారు.

కానీ చిత్రబృందం మొత్తం పట్టువదలని విక్రమార్కుల్లా బాలు వెంటే పడటం వల్ల తప్పని పరిస్థితుల్లో ఈ చిత్రానికి పాడేందుకు అంగీకరించారు. అందరూ ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు సులభంగా పాడేరీతిని ఆకళింపు చేసుకుని, గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న భయాల్ని పటాపంచలు చేసి అద్భుతంగా పాటలు పాడి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

ఈ చిత్రంతో ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డుతో పాటు నంది పురస్కారాన్ని అందుకున్నారు బాలు. అందుకే 'శంకరాభరణం' ప్రస్తావన ఎప్పుడొచ్చినా.. "సంగీతపరంగా, వాయిద్యపరంగా సహకరించిన వాళ్లందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను" అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వినయంతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు.

ఎస్పీ బాలు సింగింగ్ కెరీర్

ABOUT THE AUTHOR

...view details