ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ చాలా పేరు తెచ్చుకున్నారు. కమల్‌హాసన్ నటించిన తెలుగు అనువాద చిత్రాల్లో చాలా వాటికి తన గొంతు అరువిచ్చారు. అయితే 'దశావతారం' సినిమాతో ఎవరికీ సాధ్యమవని రికార్డును వీరిద్దరూ సృష్టించారు!
'దశావతారం'లో 7 పాత్రలకు బాలు లైవ్ డబ్బింగ్ చెబితే! - sp balu no more
కమల్ 'దశావతారం'లోని పాత్రల డబ్బింగ్‌ను, గతంలో ఓసారి లైవ్‌లో చెప్పి ఎస్పీ బాలు ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఎస్పీ బాలు
చిత్రంలో పది విభిన్న పాత్రల పోషించిన కమల్ ఔరా అనిపించగా, అందులోని ఏడు పాత్రలకు డబ్బింగ్ చెప్పిన బాలు ఆహా అనిపించారు. 2018 అక్టోబరు 7న ప్రసారమైన ఈటీవీ 'స్వరాభిషేకం' ఎపిసోడ్లో ఈ అద్భుత దృశ్యం ఉంది. ఈ వీడియోలో 14-18 నిమిషాల మధ్య బాలు డబ్బింగ్ ఉంటుంది.