వంద పాటలు.. వంద మంది గాయనీ గాయకులు... ఓ వేదిక. 'గాన గంధర్వుడి నూరు గళాల స్వరార్చన' పేరుతో నిర్వహించనున్న ఈ ఘట్టం సంతోషం - సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేదికపై ఆవిష్కృతం కానుంది.
SP balasubramaniam songs: ఎస్పీ బాలుకి 100 పాటలతో స్వరార్చన - movie news
నవంబరు 14న సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలుకు స్వరార్చన జరగనుంది. 100 మంది గాయకులు 100 అద్భుతమైన పాటల్ని ఆలపించనున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన 40 వేల పైచిలుకు పాటల్లోని ఆణిముత్యాల్ని ఈ వేదికపై వంద మంది గాయకులు ఆలపించనున్నారు. నవంబర్ 14న మధ్యాహ్నం 3 గంటలకు ఈ స్వరార్చన ప్రారంభం అవుతుందని పురస్కార ప్రదానోత్సవ నిర్వాహకులు సురేశ్ కొండేటి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవీ చదవండి: