ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. నాన్నకు ఫిజియోథెరపీ చికిత్స కూడా చేశారని అన్నారు.
ఎస్పీ బాలుకు ఫిజియోథెరఫీ చికిత్స - sp balu latest news
తన తండ్రి ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎస్పీ చరణ్ చెప్పారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన కరోనా బాధపడుతూ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎస్పీ బాలు
ఆగస్టు 5న కరోనా సోకడం వల్ల చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్ప్రత్రి చేరారు బాలు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యలో కొన్నిసార్లు ఆరోగ్యం విషమించడం, మళ్లీ నిలకడగా మారుతుండటం వల్ల అభిమానులు, దక్షిణాది సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. త్వరగా కోలుకుని, ఆయన తిరిగి రావాలని కోరుకుంటున్నారు.