ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇటీవలే కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
"బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యులు ఆయన పరిస్థితిని సమీక్షిస్తున్నారు."