ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగటివ్ వచ్చిందని ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆయన తనయుడు చరణ్.. వాటిని ఖండించారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
'ఎస్పీబీకి కరోనా నెగటివ్.. అవాస్తవమన్న చరణ్' - 'నాన్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది'
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించారు ఆయన తనయుడు చరణ్. అవన్నీ పుకార్లంటూ తెలిపారు.
బాలు
"సాధారణంగా నేనే వైద్యులను సంప్రదించాక నాన్న గారి ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఇస్తా. నాన్నకు కరోనా నెగటివ్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే అది నెగటివ్ అయినా కాకపోయినా నాన్న ఇంకా ఎక్మో వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి త్వరలోనే బయటపడతారని అనుకుంటున్నా. దయచేసి ఈ రూమర్లు ఆపండి. సాయంత్రం వైద్యులతో మాట్లాడిన తర్వాత నేను ఈ విషయంపై అప్డేట్ ఇస్తా" అని చరణ్ వెల్లడించారు.
Last Updated : Aug 24, 2020, 3:43 PM IST