'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రానికి రూ.300 రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారు. మా నాన్న నెలకు 80 రూపాయలు పంపేవారు. నాలుగు నెలలు ఇక నాన్న నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపించింది. తెగ ఆనందపడ్డా. నేను నా ఫ్రెండ్ మురళీ డ్రైవిన్ వుడ్‌ల్యాండ్స్‌కి వెళ్లి చక్కగా గులాబ్‌జామూన్, మసాలాదోశ తిన్నాం. అది చాలా ప్లాన్‌చేస్తే గానీ వెళ్లగలిగే రోజులు కావు. ఆ రోజున జేమ్స్‌బాండ్ సినిమాకు వెళ్లాం. అంతవరకూ ఎనభై నాలుగు పైసల సినిమాకు వెళ్తే ఆ రోజున రూపాయి పావలాకు వెళ్లాం. కోక్ తాగాం.
బాలు మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
దిగ్గజ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచంలో తనదైన మార్క్ చూపించారు. దాదాపు 40 వేలకు పైగా పాటల్ని పాడి గిన్నిస్ రికార్డు సాధించారు. అలాంటి గాయకుడు తన మొదటి రెమ్యునరేషన్ గురించి ఓసారి చెప్పారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
ఎస్పీ బాలు మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..?
వన్‌బైటూ కాఫీ తాగేవాళ్లం. కానీ అప్పుడు చెరోకప్పు కాఫీ తాగాం. ఆ తరువాత నేను పాడింది కన్నడ పాట. దానికి 150 రూపాయలు రెమ్యునరేషన్. ఇంతేనా అన్నాడు నా ఫ్రెండ్. వందరూపాయలు అంటేనే పెద్ద విశేషం. ముందు నాన్నకు తిరిగి డబ్బులు పంపించాలనే ఆలోచన లేదు. తెప్పించుకోకూడదనే ఆలోచన అంతే. తరువాత ఇంటికి డబ్బులు పంపే శక్తి వచ్చిందనుకోండి. అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తే. అప్పట్లో పెద్ద పారితోషికం 500 రూపాయలు. అది చెక్ రూపంలో అందుకున్నా.