సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఎంతో మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా నుంచి బయటపడి బాలుకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తున్నారు. కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గాన గంధర్వుడి కోసం రంగోలీతో ప్రార్థనలు - SPB's recovery
ఎస్పీ బాలు కోలుకోవాలని కర్ణాటకకు చెందిన ఓ రంగోలి కళాకారుడు వినూత్నంగా ప్రార్థించారు. రంగోలీతో బాలు చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది.

గాన గంధర్వుడి ఆరోగ్యం కోసం రంగోలి ప్రార్థనలు
ఇదే విధంగా కర్ణాటక మంగళూరుకు చెందిన రంగోలి కళాకారుడు జయంత్ సలియాన్ సైతం బాలు కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. రంగోలీతో ఎస్పీబీ చిత్రపటాన్ని రూపొదించారు. త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
రంగోలీతో బాలు కోసం ప్రార్థనలు