తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం

కరోనాతో పోరాడుతున్న గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

SP Balasubrahmanyam health remains critical
ఎస్పీ బాలు

By

Published : Aug 19, 2020, 6:10 PM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఎమ్​జీఎమ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన్ను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. నిపుణుల బృందం, బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు.

ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్

ఆగస్టు 5న కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు బాలు. తనకు తక్కువగానే లక్షణాలు ఉన్నాయని త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. కానీ రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడం వల్ల ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. నాన్న కోలుకున్నారని, ఆరోగ్యం బాగానే ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు.

గాయకుడు బాలు త్వరగా కోలుకోవాలని తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, గాయనీగాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్​లు పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details