ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, మిత్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అభిమానులు కూడా ఉదయం నుంచి హాస్పిటల్ వద్దకు వస్తున్నారు.
బాలు పరిస్థితి విషమం.. ఆస్పత్రికి చేరుకున్న ఆత్మీయులు - ఎస్పీ బాలు హెల్త్ అప్డేట్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎమ్ ఆస్పత్రికి ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, మిత్రులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. బాలు త్వరగా కోలుకోవాలని ఆస్పత్రి ఎదుట ప్రార్థనలు చేస్తున్నారు.
ప్రస్తుతం బాలు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా స్పందించారు.
"ఇలాంటి బాధాకర సమయంలో మాటలు రావట్లేదు. బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు. బాలు కోలుకోవాలని అభిమానులంతా దేవుణ్ని ప్రార్థించారు. మన ప్రార్థనలు, వేడుకోళ్లు దేవుడు ఆలకించినట్టు లేదు. మన ప్రార్థనలు బాలును 10 రోజులు నిలబెట్టాయి. ప్రకృతిని జయించడం మనిషి వల్ల కాలేదు. బాలు తిరిగివస్తాడన్న ఆశ నాలో ఇంకా మిగిలే ఉంది" భారతీరాజా వెల్లడించారు.