నెట్‌ఫ్లిక్స్‌లో(squid game characters) విడుదలైన దగ్గర నుంచి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న 'స్క్విడ్ గేమ్' వెబ్‌సిరీస్(squid game netflix review).. దృశ్యరూపం దాల్చడానికి మాత్రం అనేక కష్టాలు ఎదుర్కొంది. దీన్ని దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ తెరకెక్కించాడు. 'స్క్విడ్‌గేమ్'(squd game story) కథను 2009లోనే రాసుకున్నాడు. వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మాత్రం పదేళ్లపాటు ప్రసవవేదన పడిందీ కథ. ఇంత కాలం పట్టడానికి ఆర్థికంగా ఆయనను వెంటాడిన కష్టాలు కూడా కారణమే. డబ్బుల్లేక ల్యాప్‌టాప్ అమ్మేసి జీవితాన్ని నెట్టికొచ్చిన సందర్భాలున్నాయి. స్క్రిప్ట్‌తో ఏ స్టూడియోకు వెళ్లినా తిరస్కరణే ఎదురయ్యేది. 'చిన్నపిల్లల ఆటను ఎవరు చూస్తారు' అని మొహం మీదే తలుపులేసిన వారున్నారు. ప్రపంచాన్ని కొవిడ్ కుదిపేశాక 'స్క్విడ్‌గేమ్' కథపై అందరి దృష్టి పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హక్కులు తీసుకొని నిర్మించింది. ఇందులోని మొత్తం తొమ్మిది ఎపిసోడ్లను దర్శకుడే తెరకెక్కించాడు. ఆయన నిజజీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు దీన్ని మరింత బలంగా రాయడానికి తోడ్పడ్డాయి. అమెరికాతో పాటు మిగతా అన్నిదేశాల్లో ట్రెండింగ్‌లో ఉందీ సిరీస్(squid game epidsodes ). ఇండియా ఓటీటీ వీక్షకులను కూడా అమితంగా ఆకట్టుకోవడమే కాదు, కొద్ది రోజులుగా నెం.1 స్థానంలో కొనసాగుతుంది.
అప్పుల్లో కూరుకున్న వారితో నెత్తుటి ఆట
జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పుల పాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్ గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. చివరగా వచ్చే ఆట పేరే ‘స్క్విడ్ గేమ్’. దక్షిణ కొరియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న చిన్నపిల్లల ఆట ఇది. ఈ ఆరు ఆటల్లో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోవచ్చు. అన్ని సులభమైనవి, సరళమైన ఆటలే. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఈ ఆటలో ఓడిపోయినవారు పోటీ నుంచి శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. ఆటలోంచే కాదు, జీవితం నుంచే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఓడిపోతే చంపేస్తారని అర్థం. మొదటి ఆట ఆడితే కానీ ఈ విషయం వారికి తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆరు ఆటలను దిగ్విజయంగా పూర్తిచేసుకొని చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేది చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. కథనం వీక్షకుడికి ఊపిరాడనివ్వదు. చివరి దాకా ఉత్కంఠ రేపే కథనంతో థ్రిల్ గురిచేస్తుంది.
మోసం, త్యాగం....భావోద్వేగం
పోటీలో పాల్గొనే పోటీదారులకు వాస్తవ జీవితంలో గడ్డు పరిస్థితులుంటాయి. ప్రధాన పాత్రైన సియాంగ్ జీ హున్‌కి భార్యతో విడాకులు అవుతాయి. ఉద్యోగం పోతుంది. లెక్కలేనంత అప్పులు చేస్తాడు. దీనికి తోడు జూదం అతడికి వ్యసనం. అందులోనూ డబ్బులు పోగొట్టుకుంటాడు. రెండో వివాహం చేసుకున్న అతడి భార్య.. కూతురిని కూడా తనతో పాటే అమెరికా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంటుంది. కూతురిని తన సంరక్షణలోకి తెచ్చుకోడానికి డబ్బు కావాలి. అప్పు ఇచ్చినవాళ్ల నుంచి బెదిరింపులు, కూతురు తనకు దక్కదేమోనన్న భయం.. ఈ రెండు కారణాలతో ప్రమాదకరమైన ‘స్క్విడ్‌గేమ్’ ఆటలోకి అడుగుపెడతాడు. అక్కడ తన క్లాస్‌మేట్ సాంగ్ వూ కలుస్తాడు. ఒంటరిగా పోరాటం చేయడం కన్నా..కలిసి కట్టుగా ఆడితే విజయం సాధించొచ్చని అలీ, ఇల్ నామ్ ఇలా ఐదుగురు జట్టుగా ఏర్పడతారు. ఈ పోరాటంలో ఒకరికొకరు అండగా నిలబడతారు. కొన్నిసార్లు సొంతవాళ్లనే మోసం చేసుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా స్నేహం, సహకారం, మోసం, త్యాగాలతో వెబ్ సిరీస్ ఆద్యాంతం భావోద్వేగాల ప్రయాణంలా సాగి చూసే ప్రేక్షకుడికి కళ్లని తడిపేస్తుంది. ఈ పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉండడం కూడా ఈ వెబ్ సిరీస్ విజయానికి మరో కారణం.
నిజజీవితంలోనూ ఉందా?