కథానాయకుడు సూర్య డిజిటల్ తెరపైకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన త్వరలో మణిరత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారని సమాచారం. 'నవరస' అనే పేరుతో రూపొందబోయే ఈ వెబ్‌సిరీస్.. 9 ఎపిసోడ్లుగా తెరకెక్కనుందని తెలుస్తోంది.
9 మంది దర్శకులు.. ఒకే వెబ్‌సిరీస్.. హీరోగా సూర్య - NAVA RASA suriya nes
దక్షిణాధి స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య యువతను ఆకట్టుకునేందుకు మరో అడుగు ముందుకేస్తున్నారు. కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడటం వల్ల తనూ వెబ్‌సిరీస్‌ల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు ఓ ఆసక్తికర విషయం సినీవర్గాల్లో చర్చనీయాంశమౌతోంది.
వీటిలో ఒక్కోదాన్ని ఒక్కో దర్శకుడితో పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇప్పుడిందులోనే ఓ ఎపిసోడ్‌లో సూర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కథానాయకులు విక్రమ్, మాధవన్, సిద్ధార్థ్ తదితరులు ఈ వెబ్‌సిరీస్‌లోని కొన్ని భాగాల్లో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఎపిసోడ్లను తెరకెక్కించే దర్శకుల జాబితాలో మణిరత్నంతో పాటు గౌతమ్ మేనన్, బిజోయ్ నంబియార్, అరవింద్ స్వామి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగు నుంచి కూడా కొంతమంది కథానాయకులు, దర్శకులు ఇందులో పనిచేయనున్నారని సమాచారం.