ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పుష్ప' చిత్రంలోని 'దాక్కో దాక్కో మేక' సాంగ్ రికార్డులు తిరగరాస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వ్యూస్ (94 లక్షలు), టాలీవుడ్లో మోస్ట్ లైక్స్ (6.5 లక్షలు) సాధించిన లిరికల్ సాంగ్‌గా రికార్డులు సెట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. శుక్రవారం ఈ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియోను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు.
రికార్డులతో దూసుకెళ్తోన్న 'పుష్ప' సాంగ్ - దాక్కో దాక్కో మేక సాంగ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రంలోని 'దాక్కో దాక్కో మేక' సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే సౌత్ ఇండియన్ మోస్ట్ వ్యూవుడ్ లిరికల్ సాంగ్‌గా ఘనత సాధించింది.
పుష్ప సాంగ్
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబరులో విడుదల చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. దేవీశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇదీ చదవండి:'పాగల్' విడుదల.. ఫ్యాన్స్‌కు విశ్వక్సేన్ విన్నపం