తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలా జరగడానికి వారే కారణం: సౌందర్య రజనీకాంత్ - Soundarya-Rajinikanth-passport-missed-on-the-way-to-london

సూపర్​స్టార్​ రజనీకాంత్​ రెండో కూతురు సౌందర్య, భర్త విశాగన్​తో కలిసి లండన్​ టూర్​కు వెళ్లింది. అక్కడకు చేరుకోగానే పాస్​పోర్ట్​ ఉంచిన సూట్​కేస్​ కనిపించలేదు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఓ షాకింగ్​ సంఘటనను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది సౌందర్య.

రజని

By

Published : Sep 6, 2019, 4:13 PM IST

Updated : Sep 29, 2019, 3:56 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​ రెండో కుమార్తె సౌందర్య తన భర్త విశాగన్​తో కలిసి ఈనెల​ 1న యూకే పర్యటనకు వెళ్లింది. ఎమిరేట్స్​ ఎయిర్​లైన్స్​లో చెన్నై నుంచి లండన్​కు చేరుకున్న ఈ జంట.. విమానాశ్రయంలో పాస్​పోర్ట్​ కోసం చూసుకోగా అది కనిపించలేదు. దానిని ఎవరో దొంగిలించారన్న కారణంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోయింది సౌందర్య.

" అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు భద్రత ఏది.? లండన్​లోని హెత్రో ఎయిర్​పోర్ట్​లో సామాన్లు, పాస్​పోర్ట్​ పోయాయి. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విషయం తెలుసుకొని మెయిల్ ద్వారా వివరాలు చెబుతామని చెప్పారు. కాసేపటికే వారి నుంచి సమధానమొచ్చింది. అయితే దోపిడీ జరిగిన సమయంలో విమానాశ్రయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు పని చేయలేదట. అందుకే అక్కడ ఏం జరిగిందో రికార్డ్ అవ్వలేదని పోలీసులు మెయిల్ చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటారని నేను అనుకోలేదు. మాకు జరిగిన ఈ చేదు అనుభవానికి ఎయిర్‌పోర్ట్ సిబ్బందే బాధ్యులు. మాకు మాత్రమే కాదు మరెవరికీ ఇలాంటి ఘటన ఎదురుకాకూడదు''. -సౌందర్య, దర్శకురాలు

పాస్​పోర్ట్​ పోయిన విషయాన్ని తెలియజేసి లండన్​లోని భారత దౌత్యకార్యాలయాన్ని సంప్రదించారు సౌందర్య. వెంటనే వారు విశాగన్​కు నకలు పాస్​పోర్ట్​లను అందజేసినట్లు ఆమె వెల్లడించింది.

కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొన్నారు.

ఇవీ చూడండి.. రూ.400 కోట్లకు చేరువలో 'సాహో' కలెక్షన్లు

Last Updated : Sep 29, 2019, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details