కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సాయం చేసేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తమ వంతు సాయాన్ని అందించగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి నటుడు అజిత్, రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య చేరారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సౌందర్య కలిశారు. తన భర్త విశాగన్ తరఫున రూ.కోటిని ఆర్థికసాయంగా అందజేస్తున్నట్లు ఆమె తెలియజేశారు.
రజనీ కుమార్తె సౌందర్య రూ.కోటి విరాళం - Soundarya Rajinikanth
తమిళనాడు కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కు రజనీకాంత్ కుమార్తె సౌందర్య భారీ విరాళం అందజేశారు. రూ.కోటిని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు.
సౌందర్య రజనీకాంత్
అంతకు ముందు హీరో అజిత్ రూ.25 లక్షలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. సూర్య, ఆయన సోదరుడు కార్తి రూ.కోటి, దర్శకుడు మురుగదాస్ రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.