అలనాటి హీరోయిన్ సౌందర్య చివరగా నటించిన చిత్రం 'నర్తనశాల'. ఇందులోని ఆమె ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ద్రౌపది పాత్రలో ఈమె కనిపించనుంది. దసరా కానుకగా ఈనెల 24నుంచి శ్రేయస్ ఈటీ యాప్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందీ చిత్రం.
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 2004లో ప్రారంభించారు. అందులో శ్రీహరి, శరత్‌బాబు, సౌందర్య తదితరులు ప్రధాన పాత్రల కోసం ఎంపికయ్యారు. అయితే అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించడం వల్ల షూటింగ్ నిలిచిపోయింది. ఆమె లాంటి నటి ఎవరైనా ఉంటే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానని బాలయ్య చాలాసార్లు చెప్పారు. కానీ అది కుదరలేదు.